Home Politics Andhra Pradesh కడియం మండలంలో మృతుల కుటుంబాలకు వైసీపీ నేతల పరామర్శ,

కడియం మండలంలో మృతుల కుటుంబాలకు వైసీపీ నేతల పరామర్శ,

0

కడియం మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కాలంలో మరణించిన పార్టీ నాయకుల కుటుంబాలను మాజీ మంత్రి వర్యులు, వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు బుధవారం పరామర్శించారు. కడియం, కడియపులంక గ్రామాల్లో ఇటీవల మరణించిన లావేటి వైకుంఠం, అడబాల అచ్చియమ్మ, బొమ్మిరెడ్డి గంగారత్నం (తల్లమ్మ), చిలుకూరి బాపాయమ్మ, బోర్సు అప్పారావు, బోర్సు వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మృతుల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. పార్టీ ఎప్పుడూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కడియం మండల నాయకులు ఈలి గోపాలం, మార్గాని బలరామ్, సర్కార్ బాషా, చెల్లుబోయిన దుర్గాప్రసాద్, చిలుకూరి రామకృష్ణ, గుత్తుల రమేష్, లావేటి రాధాకృష్ణ, గుత్తుల అబ్బులు, వనం పుత్రయ్య, ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, బండారు శ్రీనివాస్, పూడి వీరభ్రహ్మం, సాక సతీష్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version