Home Politics Andhra Pradesh 29వ డివిజన్‌లో సమస్యలకు పరిష్కారం

29వ డివిజన్‌లో సమస్యలకు పరిష్కారం

0

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్,ఏనాటి నుంచో అపరిష్కృతంగా ఉన్న 29వ డివిజన్‌లోని సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక 29వ డివిజన్ రంభ వారి వీధిలో రూ.23 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులు, అలాగే లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల విన్నపాల మేరకు 150 మీటర్ల సీసీ రోడ్డు, ఇరువైపులా 300 మీటర్ల డ్రైనేజీలు, మరో 90 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్‌లో ఇప్పటికే రూ.30 లక్షల పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం మరో రూ.48 లక్షల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పుష్కరాల నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 11 కేవీ లైన్, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version