Home Politics Andhra Pradesh ప్రజల భద్రతే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లాలో విజిబుల్ పోలీసింగ్

ప్రజల భద్రతే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లాలో విజిబుల్ పోలీసింగ్

0

ప్రజల భద్రత, రక్షణ, ట్రాఫిక్ నియంత్రణే ధ్యేయంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్‌ను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. జిల్లాలోని ప్రధాన కూడళ్ల వద్ద లా & ఆర్డర్, సీసీఎస్, స్పెషల్ పార్టీలు మరియు ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో మోటార్ వాహనాల చట్టం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తూ ట్రాఫిక్ నియంత్రణ చేపడుతున్నారు. ట్రిపుల్ రైడింగ్, సరైన నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు, వాహన పత్రాలు లేనివారు, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారు, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్ చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version