వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటలకు, మద్దిలపాలెం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం- జోన్-1 కార్యనిర్వాహక అధ్యక్షులు జి.వి. రవిరాజు తెలిపారు.
ఈ సమావేశానికి పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, వార్డు అధ్యక్షులు, అలాగే పార్టీ శ్రేణులంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. పార్టీ గౌరవం, క్రమశిక్షణ పరిరక్షణకు, అలాగే ఏకతాటిపై నిలబడి పార్టీని ముందుకు నడిపించేందుకు ఈ సమావేశం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, పార్టీ ప్రాంతీయ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త, జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్, మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరిషిత్ రాజు, ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, వరుదు కళ్యాణి, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వెస్ట్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి
అలాగే విశాఖపట్నం పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కీలక పదవుల్లో ఉన్న నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లు జి.వి. రవిరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
31న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం
RELATED ARTICLES
