ప్రపంచ కప్ విజేతలపై మార్నింగ్ కాఫీ క్లబ్ ప్రశంసలు
అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో లో జరిగిన క్రికెట్ ఫైనల్స్ లో న్యూజిలెన్ ను ఓడించి భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలిచిందని, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని,ఆనందోత్సవాల జరుపుకునే సంఘటన అని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కొత్త శ్రీనివాస్,కోట్ల నాని అన్నారు. భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా డిఎన్నార్ రోడ్డులో తాడిమళ్ళ గిరి ప్రాంగణంలో మార్నింగ్ కాఫీ క్లబ్ అధ్వర్యంలో భారత్ టీమ్ ను అభినందిస్తూ ఆనందోత్సవ సంబరాలను నిర్వహించారు. రాంబాబు మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్ లో జట్టు అద్భుతంగా ఆడిందని, మన క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలన్నారు.
కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు, కారుమూరి సత్యనారాయణ మాట్లాడుతూ టి 20 ప్రపంచ కప్ చరిత్రాత్మక విజయమని, ఇది గర్వించాల్సిన సమయమని, భారత పురుషుల క్రికెట్ జట్టు సాధించిన విజయం కోట్లాది గుండెలను తాకిందన్నారు. మీ ధైర్యం భారత దేశానికి కీర్తిని అందించిందని, ఈ విజయం మరింతమంది భవిష్యత్ చాంపియన్లు ఆటలను కెరీర్ గా తీసుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అనంతరం అందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమం లో బొడ్డు వాసు, బోయ్స్ శ్రీనివాస్, కోట్ల ప్రసాద్, బంగారు ప్రసాద్, గుండు సుమూర్తి, కంచర్ల భాస్కరరావు,సంకా బాబు,తటవర్తి బదరీ,భామ కృష్ణమూర్తి, బొండాడ మనీష్, కురిశెట్టి సతీష్ ,తటవర్తి నారాయణ, కార్మురి బదరి, సభ్యులు పాలుగొ న్నారు
