Home Politics Andhra Pradesh పేద విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ పంపిణీ చేసిన బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ

పేద విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ పంపిణీ చేసిన బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ

0

గాంధీనగరంలో బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సమస్త 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబడింది సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఆశ్రయం పొందుతూ పదోతరగతి చదువుతున్న పేద విద్యార్థులకు ఎగ్జామ్ కిడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ సందర్బంగా సమస్త కార్యదర్శి తాతపూడి జయశ్రీ మాట్లాడుతూ 2015లో నా స్నేహితులు మరియు సమస్త అధ్యక్షులు కాళ్ళ శివశంకర్ కలిసి బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి అనేకమైన సేవా కార్యక్రమాలు అవగాహన సదస్సులు వృత్తివిద్యా నైపుణ్య కోర్సులఅను నిర్వహిస్తూ సమాజానికి తమ వంతు కృషి చేస్తూ వస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను సమాజ అభివృద్ధికి చేస్తామని తెలిపారు మేము చేస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు పాత్రికేయులకు సమస్త ప్రతినిధులకు కృతజ్ఞతలను తెలిపారు ఈ కార్యక్రమానికి సమస్త కన్వీనర్ బి బి వి ప్రసాద్ అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా అనకాపల్లి ఆర్థిక సహాయం చేశారని అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జి వి ఎం సి మోడల్ ప్రైమరీ స్కూల్ ఉడ్ పేట ప్రధాన ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థి దశలో చాలా ముఖ్యమైనదని విద్యార్థులంతా బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణులు కావడానికి అవసరమైన మెళకువలు సూచనలు సలహాలని ఇవ్వటం జరిగింది బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ పంపిణీ చేస్తున్న ఈ ఎగ్జామ్ కిట్స్ ను ఉపయోగించుకొని పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని ఆయన తెలిపారు అంతేకాకుండా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ అనేకమైన సేవా కార్యక్రమాలను చేపడుతూ సమాజం పట్ల తమ బాధ్యతను ఎంతో చిత్తశుద్ధితో నిర్వహిస్తుందని ఈ సందర్భంగా సంస్థ యొక్క సేవలను ఆయన కొనియాడారు అనంతరం సమస్త కార్యదర్శి కాకపోడు జయశ్రీ ఉడ్ పేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు యు ఉమామహేశ్వరరావు డి ఎన్ టి మరియు బిసి సాంఘిక సంక్షేమ వసతిగృహ వార్డింగ్స్ అయినటువంటి నారాయణరావు సత్యనారాయణ శ్రీనివాస్ మరియు సంస్థ ప్రతినిధుల చేతుల మీదగా విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమస్త అధ్యక్షులు కాళ్ళ శివశంకర్ సమస్త ప్రతినిధులు బి బి వి ప్రసాద్ సిహెచ్ ప్రదీప్ కుమార్ కె ఎస్ జ్యోతి కుమారి వి రాజు వివిధ సాంఘిక సంక్షేమ వసతిగృహ విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version