Home Politics Andhra Pradesh గీతం పై వైసీపీవి దిగజారుడు రాజకీయాలు: గంటా*

గీతం పై వైసీపీవి దిగజారుడు రాజకీయాలు: గంటా*

0

రాష్ట్రంలో అనేక ఉత్తమ విద్యాసంస్థల ఏర్పాటుకు భూములిచ్చిన ప్రభుత్వం.. కొత్తగా ప్రముఖ సంస్థలేవైనా కోరితే ఇవ్వడానికి సిద్ధంగా ఉందని విద్యా శాఖ మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు), పి. విష్ణుకుమార్ రాజులతో కలిసి గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ విశాఖలో గీతం యూనివర్సిటీ భూముల క్రమబద్ధీకరణ ప్రతిపాదనపై వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు క్రమబద్ధీకరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని గీతం యాజమాన్యం స్పష్టీకరిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పారు. ఎస్.ఆర్.ఎం., విట్, అమృత, సెంచూరియన్, ఎకార్డ్ వంటి ప్రతిష్టాకరమైన విద్యా సంస్థలకు అమరావతి, విశాఖలలో ప్రభుత్వం ధర నిర్ణయించి భూములివ్వడం జరిగిందని గుర్తు చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు ఎం.వి.వి.ఎస్. మూర్తి గీతం వ్యవస్థాపకుడు కావడం.. విశాఖ ఎంపీ, మంత్రి లోకేష్ తోడల్లుడు ఎం.శ్రీభరత్ ఆ యూనివర్సిటీకి ప్రస్తుత చైర్మన్ గా ఉన్న కారణంగానే వైసీపీ గీతం యూనివర్సిటీ భూముల క్రమబద్ధీకరణ అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version