Home Politics Andhra Pradesh మహా శివుని ఆశీస్సులు అందరిపై ఉండాలి

మహా శివుని ఆశీస్సులు అందరిపై ఉండాలి

0

ప్రతి ఇంట్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలి ,అజ్ఞానాన్ని, చీకటిని పోగొట్టి, ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించే రాత్రి
మహాశివరాత్రి అని విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు.
భక్తులు నిద్రపోకుండా, రోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా శివ నామస్మరణతో గడుపుతారని పేర్కొన్నారు, ఇది మానసిక పరిశుద్ధతను ఇస్తుందనే నమ్మకం అందరిలో ఉందన్నారు.
శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించిన సమయంగా దీనిని పరిగణిస్తారని చెప్పారు.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శివుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే రోజన్నారు.
ఆ రోజున లింగానికి బిల్వ పత్రాలతో పూజ చేయడం, శివాలయాలను దర్శించడం, శివ పురాణం వినడం చాలా విశేషమన్నారు.
*దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పండా వీధికి చెందిన అంబేద్కర్ సేవా సంఘానికి వాసుపల్లి గణేష్ కుమార్ రూ. ₹5000/- ల విరాళం అందజేశారు*.
ఆసీలమెట్ట కార్యాలయంలో గురువారం ఉదయం 35వ వార్డు అధ్యక్షుడు అలుపున కనక రెడ్డి సమక్షంలో సేవా సంఘం సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహాశివరాత్రి పండుగ మహోత్సవం పురస్కరించుకొని అగ్నిగుండం కార్యక్రమానికి వాసుపల్లి గణేష్ కుమార్ ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సొంత నిధులతో ఐదు వేల రూపాయలు నగదును జాతర ఖర్చులకు గాను అందజేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version