దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపుకు సంఘీభావంగా ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు నేడు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
అనేక కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా ఏఐటీయూసీ మరియు బ్యాంకు ఉద్యోగుల సంఘాల అభ్యర్థన మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టబడింది. కార్మిక హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, పెన్షన్ హక్కుల రక్షణ లక్ష్యంగా ఈ ఆందోళన నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ప్రధానంగా కింది డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు:
నూతన కార్మిక చట్టాల తక్షణ రద్దు
వేతన సవరణ అమలు పి ఎఫ్ ఆర్ డి ఏ చట్టం రద్దు చేసి పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ
పెండింగ్ బకాయిల చెల్లింపు
కాంట్రాక్ట్ ఉద్యోగుల నియమితీకరణ
పెన్షనర్లకు అదనపు క్వాంటం అమలు
ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం
ఏపీజేఏసీ అమరావతి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని సభ్య సంఘాల సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు నేడు ఫిబ్రవరి 12న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై తమ నిరసనను వ్యక్తం చేశారు.
