Home Politics Andhra Pradesh నేడు వైసీపీ కీలక సమావేశం

నేడు వైసీపీ కీలక సమావేశం

0

హాజరు కానున్న ముఖ్య నేతల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ని మరింత బలోపేతం చేసేందుకు శనివారం కీలక సమావేశం నిర్వహించనున్నట్టు జోన్ 1 ప్రచార కమిటీ అధ్యక్షులు జి వి రవిరాజు ఓ ప్రకటన లో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు
మద్దిలపాలెం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. పార్టీ బలోపేతానికి అత్యంత కీలకమైన ఈ సమావేశానికి
తప్పనిసరిగా హాజరుకావాలని పిలుపు నిచ్చారు. పార్టీ గౌరవం – క్రమశిక్షణ – ఏకతాటిపై నిలబడి
అందరూ హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి వైసీపీ ప్రచార విభాగ అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఎంపీ గొల్ల బాబూరావు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, బాలరాజు,బూడి ముత్యాలు నాయుడు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబు రావు,
జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు, విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే
విశ్వేశ్వర రాజు, మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరిషిత్ రాజు,
ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యలు వాసుపల్లి గణేష్ కుమార్, మళ్ల విజయప్రసాద్, తిప్పల గురుమూర్తి రెడ్డి, తిప్పల నాగిరెడ్డి, కన్నబాబు రాజు, త్యేనాల విజయ్ కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, కరణం ధర్మ శ్రీ, అదీప్ రాజు, ఉమా శంకర్ గణేష్, జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర, మాజీ మేయర్ హరి వెంకట కుమారి, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి,
అలాగే విశాఖపట్నం నగర పరిధిలోని పార్టీ కార్పొరేటర్లందరూ
ఈ సమావేశాన్ని వ్యక్తిగత ఆహ్వానంగా భావించి హాజరు కావాలన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version