Home Politics Andhra Pradesh విశాఖ ఎంపీ శ్రీ భరత్ భూ దోపిడీని అడ్డుకుంటాం

విశాఖ ఎంపీ శ్రీ భరత్ భూ దోపిడీని అడ్డుకుంటాం

0

ఎమ్మెల్సీ బొత్తా సత్యనారాయణ.  విశాఖ నగరంలో కోట్లవిలువైన ప్రభుత్వ భూములను
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బంధువులు, అధికార పార్టీ ఎంపీ అయిన శ్రీభరత్, గీతం యూనివర్సిటీ పేరిట విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే దానికి రాష్ట్ర కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్, రాష్ట్ర బిజెపి
అండగా నిలవడం సిగ్గుచేటు, గత రాష్ట్ర ప్రభుత్వంలో
చట్టపదంగా ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకున్న, మరల కూటమి ప్రభుత్వం చట్ట వ్యతిరేక జీవోలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బంధు ప్రీతితో చంద్రబాబు నాయుడు దారాధత్వం చేయడం
ప్రజా వ్యతిరేక విధానం, చట్ట విరుద్ధం . విశాఖ జీవీఎంసీ
కౌన్సిల్ లో నగర మెయిర్ తీరు విచారకరం. ప్రజల కోసం
ప్రభుత్వ భూములను కాపాడవలసిన ప్రథమపరుడైన నగర మేయర్ ప్రభుత్వ పక్షాన నిలబడడం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులపై దగ్గరుండి దౌర్జన్యం
సిగ్గుచేటు. మీడియా సభ్యులని కౌన్సిల్లోకి సమావేశానికి రానివ్వకుండా అడ్డుకోవడం ఇది ప్రభుత్వ పరిపాలన లేక రౌడీ పరిపాలన ప్రజలందరూ గమనిస్తున్నారని , ప్రభుత్వ భూములు వైఎస్ఆర్సిపి ప్రజా సంఘాల్ని ప్రజానాయకుల్ని అందర్నీ కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా న్యాయపోరాటం చేస్తామని తెలియజేసారు. వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు కె. కె రాజు ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదుట గాంధీ విగ్రహం దగ్గర మహా ధర్నా నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కురుసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ రావు,మాజీ ఎమ్మెల్యే లు ధర్మ శ్రీ, అదీప్ రాజ్ , చింతలపూడి రామయ్య, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, వాసుపల్లి గణేష్ కుమార్ , మాజీ మేయర్ హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, జాన్ విశ్లే జియాని శ్రీధర్ వైసిపి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ , మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version