సీడిపిఓ శాంతి దుర్గ
మహిళా శ్రేయస్సు సమాజ పురోగతని మహిళా సాధారితే అభివృద్ధికి అసలైన పునాదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ శ్రీకాళహస్తి నియోజకవర్గం అధ్యక్షులు శాంతిదుర్గ అన్నారు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ పిలుపు మేరకు మార్చి 7 వతేదీ విజయవాడలో నిర్వహించనున్న భారీ సదస్సుకు సంబంధించిన గోడ పత్రిలకను సోమవారం శ్రీకాళహస్తిలో ఉన్న తెలుగుగంగ డివిజన్ కార్యాలయం నందు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శాంతి దుర్గా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళల పాత్ర అత్యంత కీలకమని అన్నారు మహిళా ఉద్యోగుల సమస్యలు వారి హక్కులు సాదారికతపై చర్చించేందుకు విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమానికి తెలుగంగ కార్యాలయంలోని మహిళ ఉద్యోగస్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆపిసిపిఎస్ఇఎ రాష్ట్ర కౌన్సిలర్ ఎస్ విజయలక్ష్మి ని ఆహ్వానిస్తూ తెలుగుగంగ ఆఫీసులో పని చేస్తున్న మహిళ ఉద్యోగులు సిబ్బందికి అధికారిక ఆహ్వాన పత్రాలను అందజేశారు.మహిళా సాధారికత విధానాలతో నిర్వహించనున్న ఈ సదస్సు ఉద్యోగంలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని అసోసియేషన్ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుగంగలో పనిచేసే ఇంజనీరింగ్ మహిళలు,సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీజీఈఏ సెక్రెటరీ భాష ఉపాధ్యక్షులు గజలక్ష్మి తదితర ఉద్యోగస్తులు పాల్గొన్నారు.
