రోటరీ క్లబ్ గ్రేటర్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రామ్ నగర్ లోని ఎలిగేంట్ హోటల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. క్లబ్ ప్రెసిడెంట్ చింతా నేతాజీ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఆటపాటలతో సందడి చేశారు. రోటరీ మహిళల విజయ గాధలతో స్ఫూర్తిని అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏ వి ఎన్ కళాశాల ప్రిన్సిపల్ పి.కృష్ణకుమారి మాట్లాడుతూ మహిళ పట్ల ప్రవర్తించాల్సిన తీరు లో మగ పిల్లల కు వారి తల్లులు దిశా నిర్దేశం చేయాలని అభిప్రాయపడ్డారు. అలా జరిగినప్పుడే మహిళపై అగత్యాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. కార్యక్రమంలో లెబె న్సెల్ఫ్ విభిన్న ప్రతిభావంతుల పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుమ్ములూరి లక్ష్మి, ఎంటర్ పెన్యూ ర్ చెరుకూరి శోభ, చింతా రాజేశ్వరి గౌరవ అతిథులుగా పాల్గొని వారి విజయ గాధలను వివరించారు. కార్యక్రమంలో అతిధులతో పాటు మహిళలందరిని ఘనంగా సత్కరించారు. సిహెచ్. చందన కార్యక్రమ నిర్వహణలో చక్కని ప్రావీణ్యం ప్రదర్శించారు. రోటరీ ప్రతినిధులు సిహెచ్ కిషోర్ కుమార్, జీకే మూర్తి, సిహెచ్ కామేశ్వరరావు, కోటేశ్వరరావు, బచ్చు బ్రహ్మానందం, కేఎంకే రమేష్ తదితరులు పాల్గొన్నారు.
