మాడుగుల మండలం ముకుందపురం గ్రామంలో బస్సులు నిలిపి చేయాలని కోరుతూ ఆదివారం ఆ గ్రామ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇటు మాడుగుల పాడేరు నుంచి విశాఖ అనకాపల్లి ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు ముకుందపురంలో నిలుపు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన బస్సు సిబ్బంది ఆపడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన కర్రీ సుజాత ఆధ్వర్యంలో మహిళలు రోడ్డుపై బైఠాయించారు దీంతో సుమారు రెండు గంటల పాటు ఇరువైపులా పెద్ద ఎత్తున రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ముకుందపురం గ్రామంలో బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ముకుందపురంలో బస్ స్టాప్ కావాలంటూ మహిళలు ఆందోళన
RELATED ARTICLES
