Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshమానవ సేవలో మహిళలే కీలకం

మానవ సేవలో మహిళలే కీలకం

విమ్స్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

మానవ సేవ చేయటంలో మహిళలదే కీలక పాత్ర అని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శనివారం విమ్స్ ఆసుపత్రి నందు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉంది అంటే దానికి మహిళలు చేసే సేవే అన్నారు. అలాగే వైద్య రంగంలో అత్యధికంగా మహిళలే తమ సేవలను రోగులకు అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా మహిళలు అన్ని రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును పొందుతున్నారన్నారు. మహిళలు ఇంటికి, సమాజానికి, దేశానికి వెన్నుముక అని కొనియాడారు. వారు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది సమాజం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు… ఆరోగ్యం అంటేనే మహిళలు.. మహిళలు అంటేనే ఆరోగ్యమని కొనియాడారు.. ఈ సందర్భంగా విమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments