Home News వైస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం

వైస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం

0

గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో వైస్సార్సీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తిప్పల నాగిరెడ్డి , గాజువాక నియోజకవర్గం పరిశీలకులు పసుపులేటి బాలరాజు , రాజమండ్రి పరిశీలకులు తిప్పల గురుమూర్తి రెడ్డి , ఎస్ఈసీ సభ్యులు ఉరుకూటి అప్పారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థిక వనరైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను వదిలేసి, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి మాట్లాడుతూ 32 మంది అమరవీరుల త్యాగంతో నిర్మించిన విశాఖ శాఖ స్టీల్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం నీరుగార్చిందని,అసెంబ్లీలో అమరావతి రాజధానిగా తీర్మానం చేసిన చంద్రబాబు నాయుడు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని తిప్పల దేవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొందేసి మహేశ్వర రెడ్డి, మార్డుపూడి పరదేశి, పల్లా చిన్నతల్లి, ఉరుకూటి చందు, గుడివాడ అనూష లతీష్, మహమ్మద్ ఇమ్రాన్, రాజాన వెంకటరావు, ఎస్.ఎం.డీ గౌస్, నక్క రమణబాబు, ధర్మాల శ్రీను, పెదిరెడ్ల ఈశ్వరరావు, పల్లా సురేష్, సండ్రాన నూకరాజు, బోగాది సన్యాసిరావు, భూపతిరాజు శ్రీనివాసరాజు, షౌకత్ ఆలీ, గొందేసి శ్రీనివాస రెడ్డి, మంత్రి శంకర్ నారాయణ, పూర్ణానంద శర్మ, చేగొండి శ్రీనివాసరావు, బొడ్డ గోవింద్, నక్క వెంకటరమణ, చిక్కా సత్యనారాయణ, జీలకర్ర నాగేంద్ర, కటికల కల్పన, అండిబోయిన అప్పారావు, శ్రీనివాస్ పట్నాయక్, కొయ్య భారతి, గొందేసి వెంకటరమణ రెడ్డి, దామోదర్, మంగరాజు, ప్రగడ శ్రీను, గంగులూరి రోజారాణి, ఫాల్గాట్ క్రిష్ణ, చిత్రాడ వెంకటరమణ, రామచంద్ర రాజు, ఎన్నెటి రమణ, పిట్టా రెడ్డి, పేరం రామకృష్ణ రెడ్డి, లోకనాథం, ప్రగడ వేణుబాబు, నేలపాటి సత్యవతి, దుర్గమ్మ, గొరుసు రామలక్ష్మి, బేగం, ఒమ్మి ఈశ్వరి, జుత్తు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version