Home Politics Andhra Pradesh సొవ్వ లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

సొవ్వ లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

0

అల్లూరి జిల్లా
డుంబ్రిగూడ మండలం ‌సొవ్వ గ్రామపంచాయితీలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని నేటికీ ముఖ్యమంత్రి పార్టీ సిద్ధాంతాలను అభివృద్ధి చేసుకుంటూ అప్పటినుంచి ఇప్పటివరకు పేద బడుగు బలహీన వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమం అందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ కోసం ఎన్నో అహర్నిశలు ప్రేమిస్తూ ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందిస్తూ మననాలు పొందుతున్నారు. అనంతరం ప్రతి కార్యకర్త మై టిడిపి యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం చేసే పార్టీ కార్యక్రమాలు మై టిడిపి యాప్ లో అప్లోడ్ చేసి పార్టీ కార్యక్రమాలకు భాగస్వామ్యం అవుతుందని ఈ సందర్భంగా కార్యకర్తలు పేర్కొన్నారు.
అల్లూరి జిల్లా అరకు ఇంఛార్జ్ సియ్యారి దొన్నుదొర ఆదేశాలు సొవ్వ పంచాయితీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం పార్టీ44వ జెండా ఆవిష్కరించి, అనంతరం పార్టీ దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని, పేదవాడి ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, నేటికీ అదే స్ఫూర్తితో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాంగి మోహన్ దాస్. పొట్టంగి హరి పెసా కమిటీ కార్యదర్శి.పాంగి చిరంజీవి. వి లింగమూర్తి. ఆర్ రామ్ చందర్. జి గబ్బర్ సింగ్.పి చిన్న. వి గణేష్.పి లక్ష్మయ్య. రాంబాబు. తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version