Home Politics Andhra Pradesh పార్టీ అప్పగించిన బాధ్యతలను విధిగా నిర్వహిస్తాం

పార్టీ అప్పగించిన బాధ్యతలను విధిగా నిర్వహిస్తాం

0

పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు చోడవరం నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులకు పార్టీ అనుబంధ విభాగాల్లో నియామకం చేశారు.వీరిని మంగళవారం మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్చార్జి గుడివాడ అమర్ నాథ్ అభినందించారు. వారంతా అమర్నాథ్ను మర్యాదపూర్వకంగా కలసి ధన్యవాదములు తెలిపారు. పార్టీ నమ్మకంతో అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా పార్టీ అభివృద్ధికి తమ విభాగాల అభివృద్ధికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.చోడవరం నియోజకవర్గానికి రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా గుమ్మడి సత్యదేవ్ ను నియమించగా, రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శిగా పందిరి శ్రీను నియమితులయ్యారు .అలాగే అనకాపల్లి జిల్లా రైతు విభాగం అధ్యక్షులుగా నాగులపల్లి రాంబాబు (చందు రాంబాబు)ను నియమించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాద్ వారికి నియామక పత్రాలు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నేతలు పందిరి శ్రీను చందు రాంబాబు సత్యదేవ్ మాట్లాడుతూ తమ పరిధిలో పార్టీ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అఖండ విజయం సాధించేలా అన్ని విధాల కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు.శరగడం సిమ్మునాయుడు,పల్లా నర్సింగరావు,ఓరుగంటి నెహ్రూ, పుల్లేటి వెంకటరావు,నక్కా రమణ బాబు,ఆది గణపతి నాయుడు,బేరా సత్యారావు, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version