ఆంధ్ర మెడికల్ కాలేజ్ యూరాలజీ విభాగంలో సహాయ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించి, ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లో సేవలందిస్తున్న డా. ఐ.కే. రాజు , ఆంధ్ర మెడికల్ కాలేజ్ యూరాలజీ విభాగానికి అవసరమైన పలు కీలక యూరాలజీ వైద్య సామగ్రిని విరాళంగా అందజేశారు.
ఈ విరాళాల్లో డీజే స్టెంట్లు, గైడ్ వైర్లు, కాథెటర్లు వంటి అత్యంత అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయి. ఈ సామగ్రిని కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి ద్వారా యూరాలజీ విభాగానికి అధికారికంగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యూరాలజీ విభాగాధిపతి డా. ఐ. చంద్రశేఖర్ పాల్గొని, డా. ఐ.కే. రాజు విరాళం ద్వారా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న యూరాలజీ సేవలు మరింత నాణ్యతతో, సమర్థవంతంగాఘ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా యూరాలజీ విభాగానికి చెందిన అధ్యాపకులు మరియు సిబ్బంది, డా. ఐ.కే. రాజు చూపిన ఉదారతకు, అలాగే కళాశాల పట్ల ఆయనకు ఉన్న అనుబంధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి , డా. ఐ.కే. రాజు ని ఈ సేవా భావంతో యూరాలజీ డిపార్ట్మెంట్ కు వైద్య సామాగ్రి విరాళం అందజేసినందుకుగాను అభినందించారు.
