Home Politics Andhra Pradesh గుడిలోవ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: గంటా

గుడిలోవ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: గంటా

0

*గుడిలోవ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: గంటా*

సింహాచలం, అనంత పద్మనాభ స్వామి, గుడిలోవ ఆలయాలు సర్క్యూట్ గా టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం గుడిలోవలోని ప్రాచీన శివాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. గుడిలోవ రంగనాథస్వామి, శివాలయం పరిసరాలను అభివృద్ధి చేసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 2014- 19 లో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మించామని పేర్కొన్నారు. అంతకుముందు గుడిలోవలో ఏర్పాటు చేసిన వీధి దీపాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఈపీడీఎల్ ఈఈ సింహాచలం నాయుడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, బి.ఆర్.బి. నాయుడు, లొడగల వెంకట్రావు, గండ్రెడ్డి సోమినాయుడు, చందవరపు కుమార్, కె. శ్రీకాంత్ రాజు, మహంతి శివాజీ, బమ్మిడి ఉమ, అప్పల రాము, బంటు చిన్న, తమ్మిన అప్పలరాజు, బలిరెడ్డి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version