పార్టీ పటిష్టతకు కలిసి పని చేద్దాం
క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సిపి కోసం అందరూ కలిసికట్టుగా అంకితభావంతో పనిచేసి సేవలందిస్తే మంచి ఫలితాలు సాధిస్తామని టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు.
టెక్కలి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో తనను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఆర్టిఐ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా నియమితులైన ఆ క్కురాడ లోక నాథం , శ్రీకాకుళం జిల్లా మహిళా విభాగం కార్యవర్గ సభ్యురాలుగా టెక్కలి విమల కార్యకర్తలకు తిలక్ సూచించారు, ఈ మేరకు లోకనాథం, విమల ఆయనకు సాలువా కప్పి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
రాబోవు రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త అంకితభావం సేవ నిరతి తో గ్రామాల్లో పనిచేయాలని సేవలందించిన ప్రతి వారికి పార్టీ గుర్తింపు ఉంటుందని , వైయస్సార్సీపి ప్రతినిధులమంతా కలిసికట్టుగా పనిచేసే మంచి ఫలితాలు వస్తాయని తిలక్ స్పష్టం చేశారు, ఆయనతోపాటు నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి, వైయస్సార్సీపి ప్రతినిధులు జడ్యాడ జయరాం, హనుమంతు వెంకటేశ్వరరావు, ఆట్ల రాహుల్, కృష్ణారావు, ఉమాపతి, చలపతిరావు షాహు కారి శ్రీనివాస్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
