Home Politics Andhra Pradesh పెందుర్తిలో వాలీబాల్ పోటీలు –

పెందుర్తిలో వాలీబాల్ పోటీలు –

0

ప్రారంభించిన శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు

పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 94 వ వార్డు వేపగుంట పరిసర ప్రాంతాల ప్రజల ఆరాధ్య దేవత శ్రీ ముత్యమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా టిడిపి జీవీఎంసీ 94 వ వార్డ్ సీనియర్ నాయకులు గంట్ల దివాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం ప్రారంభించారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే రమేష్ బాబు క్రీడలు పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడాకారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. తండ్రి గంట్ల పెంటారావు వారసత్వాన్ని ఆయన కుమారుడు దివాకర్ అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు ఆకాంక్షించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కరక దేముడు, బైలపూడి హరగోపాల్, దాట్ల మధు,అరుణ, జనసేన నాయకులు పిన్నింటి పార్వతి, సానాతి దేవుడు, కంచిపాటి మధు, గొంతిన హైమావతి,లక్కీ గోవింద్, శ్రీను యాదవ్,తనకాల శ్రీనివాసరావు, మోటూరు చైతన్య, రాపర్తి కిషోర్, రమేష్, కర్రీ శివ,చీర రాజు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version