వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిరంతరం అండగా నిలిచే పార్టీ అని మాజీ మాజీ ఎమ్మెల్యే , వైసీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. జీ వీ ఎం సి 27 వార్డ్ అధ్యక్షుడు సర్వేశ్వర రెడ్డి తల్లి ఇటీవల మరణించారు. ఈ నేపధ్యంలో బుధవారం వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్డులో సర్వేశ్వర్ రెడ్డి అందిస్తున్న సేవలు అపూర్వం అని కొనియాడారు. మాతృమూర్తి రుణం ఎవరు తీర్చుకోలేనిది అన్నారు. ఆమె మృతికి సంతాపం తెలియజేస్తూ ఆత్మ శాంతి కలగాలని ఆకాంక్షించారు. .
