శంకరాపురంలో మిర్చి సాగు చేస్తున్న మాజీ ఎంపీ
జగన్ చుట్టూ ఉన్న కోటరీ మంచిది కాదంటూ అప్పట్లో సంచలనం సష్టించిన ఆయన తాను వ్యవసాయం చేసుకుంటానని ఏ పార్టీలో చేరబోనని ప్రకటించారు. అన్నట్టుగానే అప్పట్లో వ్యవసాయం చేస్తూ కనిపించిన ఆయన తాజాగా శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో మిరప మొక్కలకు పిచికారీ చేస్తూ కనిపించారు. అగ్నాస్త్రం తయారీకి గోవు మూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకు, వీటన్నింటినీ ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి బాగా కలియబెట్టి మరగపెట్టి 24 గంటలూ నిల్వ ఉంచి వడపోసి ఆ పై మొక్కలకు పిచికారీ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంటే ఆ మిరప ఘాటు రానున్న రోజుల్లో రాజకీయంగా ఎవరికి చూపిస్తారోనని కొందరు పొలిటికల్ సెటైర్లు వేస్తున్నారు.
