వడ్డాది గిరిజాంబ గిరిపై కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి 153వ వార్షిక కల్యాణోత్సవాలకు సంబంధించి మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం కళ్యాణరాటను వేశారు.కొండ దిగువన మెట్ల వద్ద అంగర శ్రీకాంతాచార్యులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దొండా కన్నబాబు, దొండా శ్రీరామ్ సంయుక్తంగా కళ్యాణరాటను ప్రతిష్టించారు.ధర్మకర్త కన్నబాబు మాట్లాడుతూ… ఈనెల 26వ తేదీ దొంగ పెళ్లితో ఉత్సవాలు ప్రారంభమై మార్చి 4వ తేదీ పుష్పాంజలి సేవతో ముగుస్తాయని తెలిపారు. మా ఈనెల 27న స్వామి వారి కళ్యాణం, మార్చి 3న నాగవల్లి,వసంతోత్సవం,పూర్ణాహుతి నిర్వహిస్తామన్నారు.ప్రతిరోజు పూజాదికాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి అన్నారు.ఉత్సవాలు విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమం సర్పంచ్ కోరుకొండ కామలక్ష్మ, గ్రామ పెద్దలు దొండా సన్యాసిరావు,గిరిబాబు, సయ్యపురెడ్డి శ్రీనివాసరావు, సిరిగిరి శెట్టి శ్రీరామ్మూర్తి, కుబిరెడ్డి వెంకట్రావు,వీర్ల సురేష్,సింగంపల్లి రమేష్,పొలిమేర కృష్ణ, పేరమ్మ, తదితరులు పాల్గొన్నారు.
