Home Politics Andhra Pradesh ఘనంగా ఏబీఎస్ స్కూల్ 20వ వార్షికోత్సవం7

ఘనంగా ఏబీఎస్ స్కూల్ 20వ వార్షికోత్సవం7

0

ఘనంగా ఏబీఎస్ స్కూల్ 20వ వార్షికోత్సవం
అగనంపూడి (జయ జయహే) జీవీఎంసీ 85 వ వార్డు లో ఏ బి ఎస్ పబ్లిక్ స్కూల్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వాలనా చేసిన అనంతరం పరవాడ ఎంఈఓ గొంతిన శైలజ మాట్లాడుతూ అగనంపూడి, లంకెలపాలెం ఏరియాలో ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్న ఏబిఎస్ పాఠశాలని ప్రభుత్వ నిబంధనలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
పరవాడ సీఐ ఆర్ మల్లికార్జున రావు మాట్లాడుతూ పిల్లలు నడవడిక విద్య విషయంలో పాఠశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు కూడా భాగస్వామి కావాలని కోరారు,
85 వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ ఈ పాఠశాలకి వచ్చే విద్యార్థుల వాహనాలు ఫార్మాసిటీ గొన్నవానిపాలెం ప్రజలకు సౌలాభ్యంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సహకారంతో ఎన్ హెచ్ ఎ రోడ్డు నుండి ఈ మర్రిపాల వరకు విశాలమైన రోడ్డు వేయడం జరిగిందని అన్నారు, 20 వార్షికోత్సవం సందర్భంగా పాఠశాల యాజమాన్యం, సిబ్బందికి మరియు తల్లితండ్రులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. శ్రీ తిరుమల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పిఎం కొండయ్య సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు, స్థానిక నాయకులు కర్రి దశంద్ర, బలిరెడ్డి సత్యనారాయణ, దుల్ల రామునాయుడు, అట్ట సన్యాసప్పారావు, గొన్న హేమ చందు నాయుడు, ఏపీ స్టేట్ క్రికెట్ ప్లేయర్ పి ఎ వి ఎన్ రాజు,దాసు, గొన్న రమాదేవి పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ పద్మజ దీపక్ అనంతరం ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు క్యాష్ మరియు మెమోంట్ అందజేయడం జరిగినది. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం జరిగింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version