జడ్పిటిసి సిదారి గంగరాజు
మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు సౌకర్యవంతంగా ఉండేందుకు అవసరమైన స్టేషనరీ కిట్లు పంపిణీ చేశారు అనంతగిరి జడ్పీటీసీ సిదారి గంగరాజు. అట్టలు,పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు తదితర అవసరమైన వస్తువులతో కూడిన ఈ కిట్లను విద్యార్థులకు అందజేశారు.తదుపరి విద్యార్థులతో మాట్లాడిన ఆయన, పదో తరగతితో చదువులు ఆపేయకుండా ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందాలని పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను క్రమశిక్షణతో నేర్చుకుని, పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఏకలవ్య ఉపాధ్యాయులు మాట్లాడుతూ, పదో తరగతి విద్యార్థులకు తన విలువైన సమయాన్ని కేటాయించి, పరీక్షా కేంద్రాల్లో ఉపయోగపడే వస్తువులను అందించినందుకు జడ్పీటీసీ సిదారి గంగరాజు ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏకలవ్య మోడల్ స్కూల్ ఉపాధ్యక్షురాలు, కుటుంబ సభ్యులు, ఏకలవ్య ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
