Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshడిజిటలైజేషన్ పై వాసుపల్లి దిశ నిర్దేశం*..

డిజిటలైజేషన్ పై వాసుపల్లి దిశ నిర్దేశం*..

దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు డిజిటలైజేషన్ ప్రక్రియలో ముందుండాలని ఆ వార్డు నాయకులకు మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ దిశ నిర్దేశం చేశారు. 34 వ వార్డు వైఎస్ఆర్సిపి శ్రేణులతో ఆసీలమెట్ట పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ క్యాడర్ రిజిస్ట్రేషన్, అనుబంధ సంఘాల కమిటీలు డిజిటలైజేషన్ చేయాలన్నారు. నియోజకవర్గ వార్డులలో 34వ వార్డు ముందు ఉండేలా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. 14 వార్డులు కూడా పోటాపోటీగా వేగవంతం చేయాలని సూచించారు. కష్టపడే కార్యకర్తకు వైఎస్ఆర్సిపి లో గుర్తింపు లభిస్తుందన్నారు. ఎటువంటి సిఫార్సులు లేకుండా నేరుగా సముచిత స్థానం అధిష్టానం కల్పించే విధంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వైయస్సార్ సీపి శ్రేణులందరూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేసి డిజిటలైజేషన్ను పూర్తి చేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు లింగం శ్రీను, బాడిద బోయిన అప్పారావు, లండా రమణ, జిల్లా నాయకులు వాసుపల్లి ధనరాజు, అంబటి అప్పలరాజు, బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భారత్, సౌత్ నాయకులు బెవర మహేష్, చింతపల్లి లీలా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments