Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshవాలంటరీ కుటుంబానికి వాసుపల్లి చేయూత

వాలంటరీ కుటుంబానికి వాసుపల్లి చేయూత

మెరుగైన వైద్యం, ఫిస్టులా శస్త్రచికిత్సకు వాసుపల్లి సిఫార్సు  వాలంటరీ నూరజహన్ తండ్రి అనారోగ్య సమస్యతో ఉన్నందున మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించి పరిష్కార మార్గం చూపారు. తక్షణ సహాయం కింద సొంత నిధులతో ₹.5000/-లు మెడికల్ ఖర్చులకు అందజేసి భరోసా కల్పించారు. పేషెంట్ రెండు కిడ్నీలు పాడైపోవడంతో అవసరమైన ఫిస్టుల శస్త్ర చికిత్సతో పాటు మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ సూపరిండెండెంట్ తో వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడారు*. 39 వార్డు పెరి రోడ్ నూరజహన్ *తండ్రి మహమ్మద్ చోటరాజా (53) గత కొద్ది కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ అందించిన సహాయం పట్ల వాలంటరీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ రుణపడి ఉంటామని తెలియజేశారు. ఏ సహాయం కావాలన్న అందుబాటులో ఉండి సహాయం అందిస్తానని వాసుపల్లి తెలిపారు. లక్షలాది పేద కుటుంబాలకు మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఆరోగ్యశ్రీ ను నేడు కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. మళ్లీ వైయస్సార్ ఆశీస్సులతో వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేదలకు మళ్లీ ఆరోగ్యశ్రీని, మెరుగైన వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకువస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments