Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshముస్లిం వివాహానికి వాసుపల్లి చేయూత

ముస్లిం వివాహానికి వాసుపల్లి చేయూత

దక్షిణ నియోజకవర్గ ప్రజా బంధువు, మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ముస్లిం వివాహానికి ₹ 5000 /- ఆర్థిక సహాయం చేశారు. ముస్లిం వర్గానికి చెందిన మహమ్మద్ నజీమ్ తన కుమార్తె వివాహ పత్రికను ,39 వ వార్డు వైసిపి అధ్యక్షుడు ముజీబ్ ఖాన్, మైనార్టీ సోదరులతో కలిసి వాసుపల్లికి అందజేశారు. దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ,మైనార్టీలు వైసీపీ శ్రేణులు తన కుటుంబ సభ్యులని తన వంతు బహుమతిగా సాయం అందజేసినట్లు వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ముబసిర, హఫీజ్ దంపతుల వివాహా వేడుకకు హాజరుకావాలని కోరుతూ పెళ్లి కుమార్తె తండ్రి శుభలేఖ పత్రికను అందజేశారు. వాసుపల్లి స్పందిస్తూ తప్పకుండా హాజరవుతానని వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments