నూతన జంటకు ఆశీస్సులు
రాజకీయాలకతీతంగా తరలివచ్చిన నేతలు
* జిల్లా కలెక్టర్, కమిషనర్ తో సహా పలువురి ప్రముఖులు హాజరు..
తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు
ఉత్సాహ వాతావరణంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం
విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రెండో కుమారుడు వివాహ రిసెప్షన్ కన్నుల పండువుగా జరిగింది.
ఈ పండుగకు వెలంపేట లో గల జీవీఎంసీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదిక అయింది. మంగళవారం రిసెప్షన్ కాగా బుధవారం ఉదయం 10.11 నిమిషాల ముహూర్తాన ఆ జంట ఒకటయ్యారు. విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి డాక్టర్ శంఖబ్రత బాగ్చి, రాజకీయాలకతీతంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు,
పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు, టిడిపి ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సతీమణి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివి ఎన్ మాధవ్, వైసీపీ మాజీ ఎంపీ బొత్స ఘాన్సీ, అనకాపల్లి
మాజీ ఎంపీ సత్యవతి,
వైసిపి జిల్లా అధ్యక్షులు కెకె. రాజు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాద్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి
మళ్ల విజయప్రసాద్, ధర్మశ్రీ, ముత్తoశెట్టి శ్రీనివాస్ రావు, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు
టిడిపి జిల్లా అధ్యక్షుడి పట్టాభి రామ్, , టీడీపీ, వైసిపి కార్పొరేటర్లు, సి ఎం ఆర్ అదినేత మావూరి వెంకట రమణ, పలువురు ఇలా రాజకీయాలకతీతంగా
అతిరథ మహారధులు అందరూ అందరూ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ముందుగా జరిగిన రిసెప్షన్ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకతో దక్షిణ నియోజకవర్గం పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా పలు రకాల ఉత్తరాది, దక్షిణ వంటకాలతో ఏర్పాటు చేసిన విందు అందరికి నోరురేలా చేసింది
వాసుపల్లి గణేష్ కుమార్ స్వయంగా తన కుమారుడి వివాహానికి హాజరు కావాలంటూ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మీడియా ప్రతినిధులకు, మీడియా సంస్థలకు ఆహ్వానాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు వివిఐపీలు, వీఐపీలు, పలు రాజకీయ పార్టీల నాయకులు, వైసిపి శ్రేణులు పాల్గొనడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించడం జరిగింది. దీంతో వేదిక వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
ఉత్సాహ వాతావరణంలో ఈ కార్యక్రమం ఆద్యంతం జరిగింది.
తన కుమారుని రిసెప్షన్, వివాహ వేడుకలకు కు హాజరై మంచి మనసుతో ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.
