Home Uncategorized గాజువాక బి.ఎల్.ఎ – 1 గా నియమితులైన డా.కేఎన్ఆర్

గాజువాక బి.ఎల్.ఎ – 1 గా నియమితులైన డా.కేఎన్ఆర్

0

బిజేపి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజు అధ్యక్షతన ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న “ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రెండవ విడత కార్యక్రమం ఏప్రిల్ నెల రెండవ వారంలో ప్రారంభం అవుతుందని అన్నారు. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గ బూత్ లెవిల్ ఇంచార్జి లను బిజేపి తరపున నియమించామని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన 35 మందిని ఆయా నియోజకవర్గాల్లో ఇంచార్జిలు గా నియమిస్తూ నియామక పత్రాలను రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చేతుల మీదుగా అందజేశారు. ఆయా నియోజకవర్గాల్లో వున్న ప్రతి పోలింగ్ బూత్ కి బూత్ లెవిల్ ఇంచార్జి 2 లను వెంటనే నియమించాలని ఆదేశించారు. గాజువాక నియోజకవర్గంకి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు నియోజకవర్గం ఇంచార్జ్ గా కరణంరెడ్డి నరసింగరావుని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ తన కష్టాన్ని గుర్తించి ,తనపై నమ్మకంతో పార్టీ తనకు ఈ బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కి, జిల్లా అధ్యక్షులు పరశురామరాజుకి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతను తన శక్తి మేరకు కష్టపడి పని చేస్తానని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని,అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు , జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు ,ప్రధాన కార్యదర్శులు దాడి రమేష్ నాయుడు, ధానేష్ ,వర్మ,తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version