చోడవరం,ఫిబ్రవరి 12 జయ,జయ హే
బుచ్చయ్యపేట మండలం వడ్డాది పీహెచ్సీలో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం అమలు తీరును గురువారం పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ వైద్య బృందం పరిశీలించింది.సీనియర్ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ వై రమణ, డాక్టర్ పడాల్ ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు,రోగులకు అందిస్తున్న మందులు, టెస్టులు, మానసిక రోగుల ఓపి వివరాలను స్థానిక పిహెచ్సి వైద్యులు మాధవి, రమ్యదుర్గలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మానసిక రోగులకు ఉచిత మానసిక కౌన్సెలింగ్, మందులు అందిస్తున్నట్లు తెలిపారు.గ్రామీణ స్థాయిలో ఆశా వర్కర్ల ద్వారా అవగాహన కల్పిస్తూ మానసిక ఆరోగ్య సేవలను సులభతరం చేస్తున్నామన్నారు.పిహెచ్సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
