Home Politics Andhra Pradesh పబ్లిక్ పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ..

పబ్లిక్ పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ..

0

కొయ్యూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాసరావు

అల్లూరి జిల్లా కొయ్యురు మండల పరిధిలో
సోమవారం కొయ్యూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాసరావు పరీక్షా కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో భద్రత, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, పరీక్షల నిర్వహణ విధానం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు.
విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పరీక్షలను క్రమశిక్షణతో నిర్వహించేందుకు అవసరమైన సూచనలు ఇచ్చారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, తల్లిదండ్రులు మరియు ప్రజలు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ తనిఖీ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్.ఐ కిషోర్ వర్మతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీరు ఈ వార్తకు సంబంధించి ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version