నిడదవోలు పట్టణంలోని గణపతి సెంటర్ పార్కు వద్ద ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. సీఐ తిలక్ ఆధ్వర్యంలో, ఎస్సై జయరాజు మరియు పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక చెకింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా వాహనదారుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ వంటి వాహన పత్రాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి జరిమానాలు విధిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పించారు.
అలాగే మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండాలని హెచ్చరిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. రహదారి భద్రత కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను స్థానికులు అభినందించారు.
ఈ సందర్భంగా సీఐ తిలక్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ప్రజల భద్రత కోసమే ఇటువంటి తనిఖీలు తరచూ నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సై జయరాజు కూడా వాహనదారులకు జాగ్రత్తలు సూచిస్తూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాజేంద్రప్రసాద్, మరియు కానిస్టేబుల్స్ సాంబ, రాకేష్ కిరణ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
