స్థానిక తపన ఫౌండేషన్ కార్యాలయంలో ఉగాది వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకకుప్రముఖులు
విచ్చేసి కార్యక్రమానికి వన్నె తెచ్చేరు.
ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు , ఏలూరు మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పండి
తుల వేద పఠనం, పంచాంగ శ్రవణం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
తపన పౌండే షన్ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం
RELATED ARTICLES
