నర్సీపట్నం మున్సిపాలిటీలోని శారద నగర్ బైపాస్ రోడ్ లో ఉన్న శ్రీశ్రీశ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నందు మాజీ వార్డ్ మెంబర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (బుజ్జి) ఆధ్వర్యంలో భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు , పద్మావతి దంపతులకు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ , నర్సీపట్నం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ కు తెలుగు సంవత్సరాది పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతల రాజ , పులిగా మురళి, బొడ్డు మహేష్ , లగుడు వెంకటరమణ, సుబ్రమణ్య స్వామి దేవాలయం అర్చకులు శేఖర్ స్వామి, మణికంఠ స్వామి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
