పెద్ద బొడ్డుపల్లి వైసీపీ కార్యాలయంలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. నర్సీపట్నం నియోజవర్గం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ , కళావతి దంపతులు ఉగాది సంబరాలలో పాల్గొని సాంప్రదాయ పంచాంగ శ్రవణం నిర్వహించారు. వైఎస్ఆర్సిపి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ , కౌన్సిలర్ , సర్పంచులు , కార్యకర్తలతో కలిసి ఉగాది వేడుకలు నిర్వహించుకున్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ,కళావతి దంపతులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు వైసీపీ పార్టీ తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
