Home Politics Andhra Pradesh వడ్డాది వెంకన్నకు సీతారాముల విగ్రహాలు బహుకరణ

వడ్డాది వెంకన్నకు సీతారాముల విగ్రహాలు బహుకరణ

0

కనుల పండుగగా సీతారాముల కళ్యాణ వేడుక బుచ్చయ్యపేటమండలం.వడ్డాది గిరిజాంబ గిరిపై కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉగాది సందర్భంగా గురువారం సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను బహుకరించారు.విశాఖకు చెందిన శ్రీవారి ఫోటో ఫ్రేమ్ వర్క్స్ అధినేత గండెం సత్తిబాబు, శోభారాణి దంపతులు తమ స్వంత నిధులుతో వీటిని కొనుగోలు చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి బహుకరించారు.ఈ సందర్భంగా గ్రామ పుర వీధుల్లో ఉత్సవ విగ్రహాలు,అమ్మవారి సారెతో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు.ఊరేగింపు ఆలయానికి చేరుకున్నాక అర్చకులు అంగర శ్రీకాంతాచార్యలు ఆధ్వర్యంలో హోమాధికాలు,ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీతారాముల కల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికత వెళ్లి విరిసింది.వెంకన్న ఆలయం జైశ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగింది.ఉగాది పర్వదినం కావడంతో వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది.అర్చకులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version