Saturday, May 2, 2026
HomePoliticsAndhra Pradeshగిరిజనుడు దారుణ హత్య

గిరిజనుడు దారుణ హత్య

హత్యతో ఉలిక్కిపడ్డ స్థానికులు

12 గంటల్లో హత్య కేసును చేదించిన పోలీసులు

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

కేసు దర్యాప్తు చేస్తున్న సి ఐ బి. శ్రీనివాసరావు

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఓ గిరిజనుడు దారుణ హత్యకు గురై న ఘటన చోటుచేసుకుంది. హత్య చేసిన ఇద్దరు నిందితులను గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. పథకం ప్రకారం బావ, బామ్మర్ది కలసి హత్య చేసినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అందుకు సంబంధించి జి.మాడుగుల సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరావు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముంచంగి పుట్టు మండల కేంద్రంలో గల రామాలయం సమీపంలో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్న పెదబయలు మండలం అరడకోట పంచాయతీ కేంద్రానికి చెందిన కుర్తాడి నాగేశ్వరరావు (28) అనే గిరిజనుడు మంగళవారం తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు. పెదబయలు మండలం అరడకోట పంచాయతీ గ్రామానికి చెందిన కుర్తాడి నాగేశ్వరరావు ను జీకే వీధి మండలం ఆర్ వి నగర్ చెందిన కిముడు అరుణ్, అతడి బామ్మర్ది పెదబయలు మండలం అడుగుల పుట్టు పంచాయితీ కొత్తపుట్టు గ్రామానికి చెందిన వంతాల నాగేశ్వరరావులు ఇద్దరూ బావా బామ్మర్దులు కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో నివాసముంటున్న కుర్తాడి నాగేశ్వరరావు ను మంగళవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లి అతి కిరాతకంగా కత్తులతో పొడిచి క్రూరంగా పీక కోసి హత్య చేసి నిందితులు పరారయ్యారు. జీకే వీధి మండలం ఆర్ వి నగర్ కు చెందిన కిముడు అరుణ్ కు పెదబయలు మండలం అడుగులపుట్టు పంచాయతీ కొత్తపుట్టు గ్రామానికి చెందిన కిముడు కాసులమ్మ కు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. కిముడు అరుణ్ వృత్తిరీత్యా డ్రైవర్ కావడంతో పెదబయలు గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని పెదబయల్లో జీపు నడుపుతూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. అయితే ఏడాదిన్నర క్రితం నుండి అరుణ్, కాసులమ్మల మధ్య కలహాలు రావడంతో కిమ్ముడు కాసులమ్మ భర్త అరుణ్ను వదిలి తల్లిదండ్రుల వద్ద కొత్తకోట గ్రామంలో నివాసం ఉంటుంది. గడిచిన ఏడాదిన్నర క్రితం పెదబయలు మండలం అరడకోట పంచాయతీ గ్రామానికి చెందిన కుర్తాడి నాగేశ్వరరావు అరడకోట గ్రామంలో మెకానిక్ షాప్ నడుపుతున్నాడు. నాగేశ్వరరావుకు అరడకోట గ్రామానికి చెందిన కుర్తాడి దేవి తో గత కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా కుర్తాడి నాగేశ్వరరావుకు, కిముడు కాసులమ్మకు ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడి, పరిచయం కాస్త వివాహేతర సంబంధం ఇంకా మారింది. అయితే గడచిన పది రోజుల క్రితం నుండి నాగేశ్వరరావు, కాసులమ్మలు ఇద్దరూ కలిసి ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని సహజీవనం సాగిస్తున్నారు. అయితే నాగేశ్వరరావుకు కాసులమ్మకు మధ్య వివాహేతర సంబంధాన్ని గ్రహించిన కాసులమ్మ మొదటి భర్త అరుణ్ ఈ విషయమై పలుమార్లు నాగేశ్వరరావుకు కాసులమ్మకు హెచ్చరించిన వారి పద్ధతి మార్చుకోకపోగా నాగేశ్వరరావుకు అరుణ్ కాసులమ్మలకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేది. ఈ క్రమంలో కుర్తాడి నాగేశ్వరరావు ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్న అరుణ్ అతని బావమరిది కాసులమ్మ కు అన్నయ్య అయినా వంతల నాగేశ్వరరావు తో కలిసి పధక రచన చేశాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున బావ, బామ్మర్దులు ఇద్దరూ కలిసి ముంచంగిపుట్టు మండల కేంద్రంలో కాసులమ్మతో నివాసముంటున్న కుర్తాడి నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి తలుపు కొట్టారు. కుర్తాడి నాగేశ్వరరావు తలుపు తీయగానే కిముడు అరుణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో నాగేశ్వరరావు గొంతులో బలంగా పొడిచాడు. అయితే వీరు ముగ్గురు మధ్య కొంత పెనుగులాట జరగక ప్రాణ భయంతో కుర్తాడి నాగేశ్వరరావు ఇంట్లోంచి బయటకు పరుగులు తీశాడు. నాగేశ్వరరావును వెంబడించిన అరుణ్, వంతల నాగేశ్వరరావులు, కుర్తాడి నాగేశ్వరావు వెంబడించారు. అయితే వంతల నాగేశ్వరరావు కుర్తాడి నాగేశ్వరరావు బలంగా పట్టుకోగా అరుణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో నాగేశ్వరరావు గొంతు కోసి వారు ఒక స్కూటీపై అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ ఘటనలో తీవ్రభయంతో ఆందోళనకు గురైన కాసులమ్మ అరుపులు కేకలు వేయడంతో స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జి.మాడుగుల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుకు, స్థానిక పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుర్తాడి నాగేశ్వరరావును ఆటోలో మండల కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే కుర్తాడి నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో భద్రపరచగా. మృతుడి మొదటి భార్య అయిన కిముడు దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరార్ లో ఉన్న ఇద్దరు నిందితులను 12 గంటల్లోనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జిమాడుగుల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments