Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshమహాశివరాత్రి వేళ రాజమహేంద్రవరం లో ట్రాఫిక్ రద్దీ

మహాశివరాత్రి వేళ రాజమహేంద్రవరం లో ట్రాఫిక్ రద్దీ

మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా రాజమహేంద్రవరం నగరంలోని ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చింది.
ఉదయం నుంచే గోదావరి ఘాట్ల వద్ద పుణ్యస్నానాల కోసం భక్తులు బారులు తీరారు. దీంతో నది తీర ప్రాంతాలకు వెళ్లే రహదారులపై వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. క్వారీ సెంటర్ పరిసరాల్లోని ప్రధాన మార్గాలపై వందల సంఖ్యలో కార్లు, ఆటోలు, బస్సులు చేరడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కొన్ని చోట్ల వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్య కూడళ్ల వద్ద అదనపు సిబ్బందిని మోహరించి వాహనాలను మళ్లింపు మార్గాల వైపు దారి మళ్లించారు. అయినప్పటికీ భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ట్రాఫిక్‌ను పూర్తిగా నియంత్రించడం కష్టసాధ్యమైంది.
మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు వెళ్లే భక్తులు, గోదావరి స్నానానికి వచ్చిన వారు, నగరానికి సమీప ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు పెద్ద ఎత్తున చేరుకోవడం వల్ల ఈ రద్దీ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని పోలీసులు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments