అందాల హరివిల్లుగా పేరొందిన ఆలమూరు మండలం చొప్పల్ల లాకుల వద్ద సినీ సందడి నెలకొంది. హీరో రాజ్ తరుణ్, నూతన నటి అమృత చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం టార్టాయిస్ షూటింగ్ ఇక్కడ ఉత్సాహంగా సాగింది. సహజ సౌందర్యానికి మరింత ఆకర్షణగా వర్షం సెట్టును ఏర్పాటు చేసి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. లాకులపై వర్షంలో మేకల మందతో కలిసి నడిచే దృశ్యాలు, పిల్లలతో సందడి, అరక సెట్టుపై ముచ్చట్లు, బైక్‌పై జంట ప్రయాణం వంటి సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నర్సిపూడి గ్రామానికి చెందిన సుమారు 50 మంది బాలబాలికలు షూటింగ్‌లో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.
