Home Politics Andhra Pradesh గోరక్షణ పేట రహదారి దుస్థితిపై మార్గాని భరత్ నిరసన – “సేవ్ రాజమండ్రి” నినాదంతో ప్రజా...

గోరక్షణ పేట రహదారి దుస్థితిపై మార్గాని భరత్ నిరసన – “సేవ్ రాజమండ్రి” నినాదంతో ప్రజా ఉద్యమానికి పిలుపు

0

రాజమండ్రి సిటీ 14వ వార్డ్‌లోని గోరక్షణ పేట రహదారి అధ్వాన్న స్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రోజూ ఈ రహదారిపై ప్రయాణించే ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించిన భరత్, తక్షణమే రహదారి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో యంత్రాంగం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ, ఈ రహదారి పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని స్థానికుల నుంచి ఫ్లెక్సీలపై సంతకాల సేకరణ చేపట్టారు. త్వరగా పనులు ప్రారంభించకపోతే పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి దీక్షకు దిగుతామని హెచ్చరించారు. భవిష్యత్తులో నగర సమస్యలపై “సేవ్ రాజమండ్రి” నినాదంతో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన 14వ వార్డు నాయకుడు జొన్నాడ విల్సన్ మిత్రబృందానికి భరత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version