హాజరు కానున్న సినీ హీరోస్
– చారిటీ ప్రధానంగా రెండు రోజుల పాటు క్రికెట్ పోటీలు
మధురవాడ ఏసీఏ – వీడీసీఏ స్టేడియంలో ఈనెల 28, మార్చి 1 వ తేదీల్లో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రముఖ సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్ తెలిపారు. హోటల్ డాల్ఫిన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిగతా హీరోలు సుధీర్ బాబు, ఓంకారం, అశ్విన్ బాబు, అయ్యప్ప శర్మ, ప్రిన్స్, ఖయ్యూం, ప్రభు, ఈటీవీ ప్రభాకర్, నిఖిల్, సామ్రాట్, నందకిషోర్ నందకిషోర్, పవన్ సాయి, సాంబతో కలిసి క్రికెట్ పోటీల వివరాలను వెల్లడించారు. టాలీవుడ్ నటులు, టీవీ నటులతో రెండేసి టీంలు.. పోలీసులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులతో ఒక్కో టీం చొప్పున మొత్తం 7 టీంల నుంచి 110 సెలబ్రిటీలు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ మ్యాచ్ ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద పిల్లల చదువు, సీఎం సహాయ నిధి, దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తారని పేర్కొన్నారు. విశాఖను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్ గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందన్నారు. రెండు రోజుల పాటు అలరించనున్న సెలబ్రిటీ లీగ్ ను వీక్షించే అవకాశాన్ని విశాఖ ప్రజలు ఉచితంగా తిలకించే వినియోగించుకోవాలని కోరారు.. సెలబ్రిటీ లీగ్ నిర్వాహకుడు రాంబాబు మాట్లాడుతూ క్రికెట్ పోటీల నిర్వహణలో వెన్నంటి ఉండి నడిపిస్తున్న ఎమ్మెల్యే గంటా సూచనతో ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించామని తెలియజేశారు. ఐపీఎల్ తరహాలో సెలబ్రిటీ మ్యాచ్ లను డిజైన్ చేశామన్నారు. టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోస్టర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు. సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ, నగర పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ ఎంతగానో సహకరిస్తున్నారని తెలియజేశారు. మొదటిరోజు మూడు టీములు, తలపడతాయని తెలిపారు.
