గోకవరం గ్రామదేవత మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారిని సోమవారం జగ్గంపేట జనసేన ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ ఆచంట రాజు, ఆలయ కమిటీ సభ్యులు, జన సైనికులు ఘన స్వాగతం పలికారు.అనంతరం తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ గోకవరం గ్రామదేవత గుబ్బాలమ్మ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. గ్రామాన్ని సంరక్షించి, కోరిన కోరికలు తీర్చే దేవతగా పేరొందిన గుబ్బాలమ్మ అమ్మవారి చల్లని ఆశీస్సులతో గ్రామమంతా పాడిపంటలతో, గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గోకవరం మండల జనసైనికులు గాజంగం రామలింగేశ్వరరావు (నాని), దోసపాటి సుబ్బారావు,చల్లపల్లి ప్రసాద్, తేజ, నక్కా రామరాజు, మహిపాల పాండురాజు, ఆలయ కమిటీ సభ్యులు గండ్రెడ్డి సన్యాసిరావు, పీతా శ్రీను తదితరులు పాల్గొన్నారు
గ్రామదేవత గుబ్బాలమ్మను దర్శించుకున్న తుమ్మలపల్లి
RELATED ARTICLES
