Home Editorials గ్రూప్ 2 లో మక్కువ మండలానికి చెందిన ముగ్గురుకి కొలువులు

గ్రూప్ 2 లో మక్కువ మండలానికి చెందిన ముగ్గురుకి కొలువులు

0

శంబరలో ఇద్దరు విద్యార్థులకు కొలువు
*వెంకటభైరంలో ఎంఎస్ ఆర్ ఫౌండేషన్ అధినేత కుమార్తెకు కొలువు
*ప్రతిభ చాటిన విద్యార్థులకు అభినందనల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండల విద్యా కుసుమాలు తమ ప్రతిభను కనబరిచి మక్కువ మండల కీర్తిని రాష్ట్ర నలుమూలల వ్యాపింప చేశారు. మన్యం జిల్లాలో ఒక్క మక్కువ మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు ఏపీపీఎస్ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో ప్రభుత్వ కొలుపులు సాధించడం విశేషం.! వీరిలో శంబర గ్రామానికి చెందిన వారే ఇద్దరు విద్యార్థులు కావడం మరో విశేషం.! శంబర గ్రామ కీర్తిని దశదిశల వ్యాపింప చేసిన విద్యార్థులను పలువురు అభినందిస్తున్నారు. వీరిలో ఆర్నిపల్లి సంతోష్ కుమార్ గ్రూప్ టు ఫలితాల్లో ప్రతిభ కనబరిచి అసిస్టెంట్ లేబర్ ఇన్స్పెక్టర్ గా ప్రభుత్వ కొలువును సాధించారు. అలాగే మరో విద్యార్థి గంట భాను ప్రసాద్ గ్రూప్ 2లో తన సత్తా చాటి జిఎడి అమరావతిలో ప్రభుత్వ కొలువు పొందారు.వీరి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలించగా ఆర్నిపల్లి సంతోష్ కుమార్ తల్లిదండ్రులు ఆర్నిపల్లి పోలిరాజు అప్పల నరసమ్మ సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు. వ్యవసాయమే జీవనాధారంగా సాగిస్తూ పిల్లలు చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. వారి శ్రమ ఫలితమే కుమారుడు నేడు ప్రభుత్వ కొలువును సాధించేలా చేసిందని పలువురు సంతోష్ కుమార్ తో పాటు వారి తల్లిదండ్రులు అభివృద్ధిస్తున్నారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన గంట భాను ప్రసాద్ కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే.! దళిత కుటుంబానికి చెందిన గంట భాను ప్రసాద్ తల్లిదండ్రులు గంట బుచ్చియ్య, గంట హేమ కుమారి నిరుపేద కుటుంబీకులు. అయినప్పటికీ కుమారుడు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ , నేడు గ్రూప్ 2లో తమ కుమారుడు ప్రతిభను కనబరిచి ప్రభుత్వ కొలువులను సాధించడంతో వారి ఆనందానికి అవదులు లేవు. తల్లిదండ్రుల కష్ట ఫలితమే నేడు గంట భాను ప్రసాద్ గ్రూప్ 2 లో సాధించిన ఉద్యోగమని పలువురు అభినందిస్తున్నారు. ఇదే మండలం వెంకటభైరపురం గ్రామానికి చెందిన ఎమ్మెస్సార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరడ శ్రీనివాసరావు , మరడ వెంకటరత్నం దంపతుల కుమార్తె మరడ మానస ప్రియ గ్రూప్ టు లో తమ ప్రతిభను చాటి తండ్రికి తగ్గ కుమార్తెగా పేరు తెచ్చుకున్నారు. గ్రూప్2లో తమ ప్రతిభను చాటి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ప్రభుత్వ కొలువు పొందారు.తండ్రి మరడ శ్రీనివాసరావు ప్రభుత్వ అధ్యాపకులు, తల్లి మరడ వెంకటరత్నం అదే గ్రామంలో సర్పంచ్ గా ఉన్నారు. తండ్రి మరడ శ్రీనివాసరావు తమ స్వగ్రామైన వెంకట భైరపురంలో ఎమ్మెస్సార్ ఫౌండేషన్ ఏర్పాటుచేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రాంతయుల మన్ననలు పొందారు. తమ కుమార్తె మరడ మానస ప్రియ గ్రూప్ టు లో ఉత్తమ ప్రతిభను చాటడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెస్సార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరడ శ్రీనివాసరావు , మరడ వెంకటరత్నం దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రూప్ టు లో సత్తా చాటి ప్రభుత్వ కొలువలు సాధించిన మండలంలో ముగ్గురు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పలువురు అభినందిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version