జూ పర్యటన లో పలు అభివృద్ధి పనులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం విశాఖలో పర్యటించారు. అటవీ–పర్యావరణ శాఖలకు సంబందించి మంత్రి పవన్ కళ్యాణ్ ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు.
అయన తల్లి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్‌లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రెండు జిరాఫీల సంరక్షణకు అయ్యే సంపూర్ణ వ్యయాన్ని స్వయంగా భరించనున్నట్లు తెలిపారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జూ పార్క్‌లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను ప్రారంభించారు. జూపార్క్‌లోని ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్‌క్లోజర్లను సందర్శించారు. జంతువులకు అందించే ఆహారం, వాటి పేర్లు తదితర వివరాలను జూ క్యూరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీల శాలల్లో స్వయంగా ఆహారం అందించారు, ఈ సందర్భంగా జూ నిబంధనలు పాటించారు. కంబాలకొండ ఎకో పార్క్‌లో నగర వనాన్ని ప్రారంభించారు. ఎకో పార్క్‌లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ నిర్వహించారు. మార్గమధ్యంలో వివిధ మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లో పలువురు అధికారులు పాల్గొన్నారు.