బకాయిల చెల్లింపులకు ఎమ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ???
గోవాడ సుగ ర్స్ రైతులు కార్మికులకు బకాయిలు చెల్లిస్తామంటూ నమ్మబలికిన నిలువునా మోసం చేశారని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలపై మండిపడ్డారు.ఈ మేరకు శుక్రవారం మీడియాతో సమావేశమైన రెడ్డిపల్లి మాట్లాడుతూ బకాయిలు చెల్లించాలని, గోవాడ సుగర్స్ లో క్రషింగ్ జరపాలని అఖిలపక్షాలు, రైతు, కార్మిక సంఘాలు తలపెట్టిన నిరసన దీక్షలకు మేమున్నామంటూ … బకాయిలు చెల్లిస్తామని, ఫ్యాక్టరీ కు పూర్వవైభవం తీసుకువస్తామని ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు నెలలు దాటుతున్నను,…. బకాయిలు చెల్లించకుండా కార్మికులు, కర్షకులను మోసం చేశారని విమర్శించారు. చెరకు రైతులు, కార్మికుల సహకారంతో ప్రతిష్టాత్మక స్థానం సాధించిన గోవాడ సుగర్స్ లో పాత బకాయిలు చెల్లించాలంటూ రైతు సంఘాలు, అఖిలపక్షాల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సైతం కార్మిక కర్షక కుటుంబాలు పస్తులతో తలపెట్టిన 23 రోజుల నిరసన దీక్షలకు ప్రజా ప్రతినిధులు నీళ్లు వదిలారని తెలిపారు. సుమారు 23 రోజులకు కదలి వచ్చిన చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.ఫ్యాక్టరీ వద్ద కార్మికులు, కర్షకులు చేస్తున్న నిరసన దీక్ష శిబిరానికి వచ్చిన ఎమ్మెల్యేలు సమస్యలు తెలుసుకుని … కార్మికులు కర్షకుల పాత బకాయిలు చెల్లింపులకు హామీలు ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ గోవాడ ఫ్యాక్టరీ ఆధునీకరణకు కృషి చేస్తామని,
జనరల్ బాడీ నిర్వహించి అందరి అభిప్రాయాలతోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారన్నారు. కార్మిక, రైతు సంఘాలు, అఖిలపక్ష పార్టీల ప్రతినిధులు శిబిరం తరపున ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించి, కార్మికులు, చెరకు రైతుల బకాయిలను ముఖ్యమంత్రి చంద్రబాబుతోను, ఆర్థిక శాఖ మంత్రులతో చర్చించి నెల రోజుల్లోగా చెల్లించేందుకు, ఫ్యాక్టరీ ఆధునికీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిధులు తీసుకొస్తామని బహిరంగంగా హామీలు ఇచ్చి, నెలలు దాటుతున్నను, ఎమ్మెల్యేల వ్యవహారం నిమ్మకునీరెత్తనట్లు ఉండడంతో హామీలు గాలికి కలిసిపోయాయని, దీనిపై మరో పోరాటం చేయాలన్నారు.
రైతులకు, కార్మికులకు ఇచ్చిన హామీలు
నిలబెట్టుకోకపోతే …కొద్ది రోజుల్లోనే రైతులు, కార్మికులను ఐక్యంగా కూడగట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అఖిలపక్షాల తో చర్చించి మరో పోరాటానికి నాంది పలుకుతామని తెలియజేశారు.
