Wednesday, April 22, 2026
HomeNewsబౌద్ధ క్షేత్రాల భూసంపదను నాశనం చేస్తున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వం.

బౌద్ధ క్షేత్రాల భూసంపదను నాశనం చేస్తున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వం.

రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రవేట్ సాఫ్ట్ వేర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా బావికొండ బౌద్ధ క్షేత్ర భూములను ఇవ్వడం, రాష్ట్ర కూటమి ప్రభుత్వం బౌద్ధ క్షేత్రాల సంపదను నాశనం చేయడమే అని కొత్తపల్లి వెంకట్రావు ప్రధాన కార్యదర్శి బుద్ధిష్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ ఆరోపించారు. విశాఖ చరిత్ర బౌద్ధ చరిత్ర, విశాఖపట్నం ఎన్నో బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి, బౌద్ధ క్షేత్రాలను కాపాడవలసిన కూటమి ప్రభుత్వం , ప్రభుత్వమే భూమిని ప్రైవేటు సాఫ్ట్ వేర్ కంపెనీల వ్యక్తులకు కేటాయించి నిబంధనలకు విరుద్ధం. అక్కడ స్వయానా మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన ఎలా చేస్తారున్ని . బుద్ధిస్ట్ సొసైటీస్ , అంబేద్కర్ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బావి కొండపై ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన స్థలమును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం, లేనియెడల దేశవ్యాప్తంగా బౌద్ధ సంఘాలు, అంబేద్కర్ సంఘాలు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడుతున్న ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ బౌద్ధ క్షేత్రాల్ని నాశనం చేస్తుంటే మీరు చూస్తూ ఏమి చేస్తున్నారు, సనాతనం అంటే బౌద్ధం అని మీకు తెలియదా, భారతదేశం అంటే బౌద్ధం. సాఫ్ట్ వేర్ కంపెనీస్ కు హోటల్స్ కు , ఎంటర్టైన్మెంట్ పర్యాటక పేరున బౌద్ధ క్షేత్రాలన్ని నాశనం చేస్తారా , తిరుమల తిరుపతి దేవస్థానం భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి కేటాయించగలరా. మీ దృష్టిలో బౌద్ధ క్షేత్రాలు చులకన అయిపోయా. విశాఖ పట్నం జిల్లాలో ఉన్న తొట్లకొండ బావికొండ పావు రాలుకొండ మరియు సింహాచలం కొండ కూడా బౌద్ధ క్షేత్రాలే.జిల్లా కలెక్టర్ వారు , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, కూటమి ప్రభుత్వం బౌద్ధక్షేత్ర భూసంపదలను తక్షణమే పరిరక్షించాలని బౌద్ధ సంఘాలు అంబేద్కర్ సంఘాలు కొత్తపల్లి వెంకట్రావు ప్రధాన కార్యదర్శి బుద్ధిష్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ విజ్ఞప్తి చేసేరు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments