Home News సృష్టికి మూలం “స్త్రీ”- డాక్టర్ పైడి.సింధూర

సృష్టికి మూలం “స్త్రీ”- డాక్టర్ పైడి.సింధూర

0
  • సృష్టికి మూలం “స్త్రీ”
  • లయన్ డాక్టర్.పైడి.సింధూర
    అరసవల్లి (జయ జయహే)

సృష్టికి మూలం “స్త్రీ” అని, ప్రతీ మహిళా శక్తిమంతురాలుగా మారాలని, లయన్ డాక్టర్.పైడి.సింధూర అన్నారు. స్త్రీలపై హింసా వ్యతిరేకతను నిరసిస్తూ బుధవారం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా.పైడి.సింధూర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగముగా ఆమె, ప్రముఖ వైద్యురాలు లయన్ శ్రావ్య, జీఎన్వి జ్యుయలర్స్ లయన్ సంధ్యరాణితో కలసి మాట్లాడుతూ నేటి సమాజములో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయము, విద్యాపరముగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, గృహ హింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయన్నారు. ఆత్మన్యూనతా భావానికిలోనై స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వీటిన్నింటినీ అరికట్టే ప్రయత్నములో ప్రభుత్వం చొరవచూపి, స్త్రీల స్వేచ్ఛను కాపాడాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకులు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్, సీనియర్ సభ్యులు గుత్తు.చిన్నా రావు, జిఎన్వి జ్యుయలర్స్ అధినేత కిరణ్ , జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సభ్యుల బృందం, చైతన్య సహకార జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.శ్రీనివాస రావు, ఉపాధ్యాయులు , విద్యార్థినిలు, స్థానికులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version